టీమిండియా మరో ఓటమి.. సిరీస్‌ కివీస్‌ వశం

క్రైస్ట్‌చర్చ్‌: వన్డే సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే మ్యాచ్‌లో భారత్‌ ‘ఏ’ జట్టు చెతులెత్తేసింది. అనధికారిక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌ ‘ఏ’ తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత జట్టు చేజార్చుకుంది. కివీస్‌ జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో మ్యాచ్‌ను అదేవిధంగా సిరీస్‌ను కూడా కివీస్‌ కైవసం చేసుకుంది.